ములుగు గ్రామపంచాయతీ పరిధిలో అక్రమ వెంచర్లు చెక్ పెట్టాలని అక్రమ కట్టడాలను నిలిపివేయాలని, లేఅవుట్ పర్మిషన్ తప్పనిసరి అని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ములుగు గ్రామం సర్పంచ్ వార్డు సభ్యులతో డిపిఓ, ఆర్డిఓ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ములుగు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమార్ లేఅవుట్ పర్మిషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఇటీవల అక్రమ వెంచర్లు పై కంప్లీట్ వచ్చాయని అన్నారు. లే అవుట్ పర్మిషన్ లేకుండా నూతన ఇండ్లకు నిర్మాణం ఎలా చేస్తున్నారని పర్మిషన్ ఎలా ఇస్తున్నారని అధికారులు అడిగారు.
వార్డ్ సభ్యులతో గ్రామ సర్పంచ్ కార్యదర్శి ఫీల్డ్ వెరిఫికేషన్ వెళ్లి రెవిన్యూ సిబ్బంది తో సర్వే రిపోర్ట్ సమర్పించాలన్నారు. గ్రామపంచాయతీ పాలకమండలి గ్రామసభ తీర్మానం ప్రకారం అక్రమ కన్స్ట్రక్షన్స్ జరగకుండా చూసుకోవాలన్నారు. ప్రతి వార్డు లో వార్డు సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ములుగు జంగాలపల్లి మల్లంపల్లి ఏరియాలో విపరీతమైన అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని పర్మిషన్ లేకుండా ఎలా జరుగుతున్నాయి సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని అన్నారు. లే అవుట్ అనుమతి చేసుకోకుండా అక్రమ కట్టడాలు జరుగుతుంటే నిర్లక్ష్యం తగదు అని సూచించారు. ప్రతి గ్రామ సభలో తీర్మానం జరిగిన ప్రతి మినిట్స్ రిపోర్టు నా దగ్గరికి రావాలని అన్నారు కన్స్ట్రక్షన్ జరుగుతున్న భూమి రెవిన్యూ అసైన్డ్ వాటి వివరాలు లు దస్తావేజులు పరిశీలించాలన్నారు అభివృద్ధిని అడ్డుకుంటే భవిష్యత్తులో పురపాలక సంస్థ ఏర్పాటుకు ఎలా సిఫారసు చేస్తారు అని తెలిపారు. లేఅవుట్ డెవలపర్స్ వస్తే వార్డు సభ్యులకు కనీస అవ్వగాహణ ఉండాలి పంచాయతీ సెక్రెటరీ లెటర్ రాసి భూములకు సంబంధించిన దస్తావేజులు పరిశీలించి పర్మిషన్ లకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. 2019 నుండి వెలిసిన వెంచర్ల యొక్క వివరాలు లే అవుట్ పర్మిషన్ భవన నిర్మాణాలకు పర్మిషన్ సరైన దస్తావేజులు పరిశీలించిన తర్వాత ఇవ్వాలని గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు. ప్రతి వార్డు సభ్యుడికి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడానికి హక్కు ఉందని 2019 పంచాయతీ చట్టం ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని పేర్కొన్నారు.
అక్రమ నిర్మాణాలు జరిగితే ఊరుకోమని పోలీస్ శాఖ వారి సహాయంతో జెసిపితో బుల్డోజర్ తో కూల్చివేస్తామని, ఫీల్డ్ మీదికి గ్రామ పంచాయతీ సెక్రెటరీ వార్డు సభ్యులు రెవిన్యూ విఆర్ఓ, ఆర్ఐ తప్పకుండా వెళ్లాలని ఆదేశించారు. లేఅవుట్ పర్మిషన్ లేకుండా భవన నిర్మాణాలు జరిపితే 25000 పెనాల్టీ విధించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు. నూతన భవన నిర్మాణానికి దరఖాస్తులు వచ్చిన 21 రోజుల్లో ఫీల్డ్ మీదికి వెళ్లి వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు.