మక్తల్, నవంబర్12(ప్రభన్యూస్) – మక్తల్ అసెంబ్లీ స్థానం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తికి మూడుసార్లు నియోజకవర్గ ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఏమాత్రం అభివృద్ధి చేయలేదని నాలుగోసారి అధికారమిస్తే నియోజకవర్గాన్ని నట్టేట ముంచడం తప్పా మరేమీ చేయలేడని మక్తల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి అన్నారు .నమ్మి నట్టేట మునగడం కన్నా పేదింటి బిడ్డను మీ మధ్య ఉండే వాడిని నన్ను ఆశీర్వదించి గెలిపించండి నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు. గెలిచిన ఏడాదిలోపే అచ్చంపేటకు రోడ్డు సౌకర్యం కల్పిస్తానని ప్రజల హర్షధ్వానాలు మధ్య హామీ ఇచ్చారు. మాగనూరు మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ పూలవతి ,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బి.ఆర్.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వాకిటి శ్రీనివాసులు బి.ఆర్.ఎస్ పార్టీకి రాజీనామా చేసి 300 మంది అనుచరులతో కలిసి ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
. పార్టీలో చేరిన వారందరికీ వాకిటి శ్రీహరితో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఒకసారి ఓడిపోయినప్పటికీ అక్క మంత్రిగా ఉండడంతో అధికారాన్ని చలాయించాడన్నారు .అయినా నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. మూడుసార్లు గెలిచి చేసిన అభివృద్ధి కన్నా ఆయన ఖనిజ సంపద అయినటూవంటి ఇసుక, ఓండు మట్టి ,మొరంబట్టిని దోచుకున్నదే ఎక్కువ అని ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలు తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు.
. ఈ కార్యక్రమంలో బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి జి. లక్ష్మారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి. రవికుమార్ యాదవ్, నాయకులు కే .ఆంజనేయులు గౌడ్, మాన్వి రామారావు,బోయ రవికుమార్, బి. గణేష్ కుమార్, బి .చంద్రకాంత్ గౌడ్, కావలి తాయప్ప, తదితరులు పాల్గొన్నారు.