పెద్దపల్లి రూరల్, జూన్ 25(ప్రభ న్యూస్): ముదిరాజ్ సామజిక వర్గం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవీ నుండి తొలగించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షడు పిల్లి శేఖర్ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్దపల్లి బస్టాండు వద్ద రాజీవ్ రహదారిపై ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. రాస్తా రోకో చేసి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డి తక్షణమే ముదిరాజ్ లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసిఆర్ కౌశిక్ పై చర్యలు తీసుకుని పార్టీ నుండి బహిష్కరించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూనె రాజేశం, పోతరవెన క్రాంతి, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి పిడుగు సంపత్, జిల్లా ఉపాధ్యక్షుడు తీగల సదయ్య, వేల్పుల సరోజన, పిడుగు కవిత, అనవెన సదయ్య, రెడ్డి శేఖర్, మల్లిఖార్జున్, జెట్టి సతీష్, రేండ్ల శ్రీనివాస్, పిడుగు భీమలింగు, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.