Tuesday, October 29, 2024

ADB | ముధోల్ బంద్ ప్రశాంతం

  • హిందు మందిరాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి..
  • హిందు ఉత్సవ కమిటీ, హిందు వాహిని ముక్తాపూర్ శాఖ


ముధోల్, అక్టోబర్ 26 (ఆంధ్ర‌ప్ర‌భ ) : హిందూ మందిరాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ముధోల్ హిందు ఉత్సవ కమిటీ, హిందు వాహిని ముక్తపూర్ శాఖ పేర్కొన్నారు. హిందువుల ఆత్మాభిమానమైన దేవిదేవతల విగ్రహాలను ధ్వంసం చేసారని నిరసిస్తూ నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలోని శివాజీ చౌక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. హిందువులందరు ఏకమై స్వచ్చందంగా దుకాణ సముదాయాలను మూసివేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇటీవల సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయ దేవత విగ్రహామును ధ్వంసంచేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. హిందు దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అదేవిధంగా హిందు దేవాలయాల విగ్రహాల విధ్వంసం వెనుక ఎవరి ప్రమేయం ఉన్నదో తెలుసుకోవాలని, సీబీ సీఐడి కి కేసును అందజేయాలని డిమాండ్ చేశారు. హిందువులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. ముధోల్ సి.ఐ జి మల్లేష్ ఆధ్వర్యంలో ఎస్. ఐ సాయికిరణ్ బందోబస్తును నిర్వహించారు. ముధోల్ బంద్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది.

ఈ కార్యక్రమంలో ముధోల్ హిందు ఉత్సవ కమీటీ అధ్యక్షులు రోళ్ల రమేష్, గౌరవ అధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, హిందు వాహిని అధ్యక్షులు సారథి రాంకీ, బిజెపి ముధోల్ మండల అధ్యక్షులు కోరి పోతన్న, బిజెపి నాయకులు తాటివార్ రమేష్, రుమొల్ల సాయి, వి ప్రవీణ్,సతీష్, కదం సంతోష్, ముధోల్ హిందు ఉత్సవ కమిటీ, హిందు వాహిని ముక్తపూర్ శాఖ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, దుకాణాల యజమానులు, గ్రామస్తులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement