Friday, November 22, 2024

నీట్ లో ఆలిండియా ర్యాంక్ 1 సాధించిన హైద‌రాబాద్ విద్యార్థి మృణాళ్

రోజువారీ పనుల్లో తగిన బ్యాలెన్స్‌, చదువులపై ఏకాగ్రత, మధ్య మధ్యలో స్వల్ప బ్రేక్స్‌ తీసుకొని ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌, హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి మృణాళ్‌ నీట్‌ యూజీ 2021 పరీక్షలో 720 మార్కులు స్కోర్ చేసి ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 1 సాధించాడు. ఒకప్పుడు కెమికల్‌ ఇంజినీర్‌ కావాలని ఆకాంక్షించిన మృణాల్‌, తొమ్మిది తరగతిలో ఉన్నప్పుడు గ్రహించాడు సమాజానికి సేవ చేసేందుకు మెడిసిన్ మంచి అవకాశమని, ఆరోగ్యరంగంలో కెరీర్‌ ఆసక్తికరంగానే కాదు సవాళ్లతోనూ కూడి ఉంటుందని తెలుసుకున్నాడు.

హైదరాబాద్ లో నిర్వహించిన అభినందన సభలో మాట్లాడుతూ… సామాజిక ప్రణాళికతో ఉత్సాహ కరమైన వాతావరణంలో విజయాన్ని అవలీలగా సాధించవచ్చునని పేర్కొన్నాడు. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ సౌత్‌జోన్ (ఏఈఎస్ఎల్) ధీరజ్ కుమార్ మిశ్రా , డిప్యూటీ డైరెక్టర్, కె శేషగిరి రాజు, రీజనల్ హెడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణా, ఎం.భరత్ కుమార్, ఇతరులు పాల్గొని మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థిని సత్కరించారు. ఈసంద‌ర్భంగా మృణాళ్ మాట్లాడుతూ..నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్నప్పుడు త‌న హాబీలు వేటిని విడిచిపెట్టలేదన్నాడు. అలా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అని అభిప్రాయపడ్డాడు. లాక్‌డౌన్ సమయం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని అన్నాడు.

మృణాళ్‌ సాధించిన విజయంపై ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకాశ్‌ చౌదరి మాట్లాడుతూ…తెలివైన విద్యార్థుల్లో ఒకడైన మృణాళ్‌ కోసం మొత్తం ఆకాశ్‌ టీమ్ అంతా పాటుపడిందన్నారు. అతనిలో ఆత్మవిశ్వాసం, స్థిరత్వం త‌మకు కనిపించిందన్నారు. చదువుకు అవసరమైన సరైన ఆలోచనతో పాటు వ్యూహాం కూడా అతనికి ఉందన్నారు. ఏమైనా సందేహాలుంటే తన టీచర్లు, మెంటార్లతో నివృత్తి చేసుకునే అవకాశాన్ని అతను ఏనాడు వదులుకోలేదన్నారు. అద్భుత విజయం సాధించినందుకు మృణాల్‌ను తాము అభినందిస్తున్నామ‌ని, ఉన్నత విద్యలో మరింత రాణించి మెడిసిస్‌లో కెరీర్‌ సాగించాలని ఆకాంక్షిస్తున్నామ‌ని తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement