Saturday, November 23, 2024

ఓటుకు నోటు కేసు విచారణపై హైకోర్టులో రేవంత్​ పిటిషన్​

ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణ ప్రక్రియపై ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారులు, పంచనామా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసే వరకు.. ప్రధాన సాక్షులు స్టీఫెన్ సన్, ఆయన స్నేహితుడు మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా వేయాలని కోరారు. తన అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చడాన్ని రేవంత్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.  దర్యాప్తు అధికారుల విచారణను చివరలో చేపట్టాలన్న సంప్రదాయాన్ని కూడా ఏసీబీ కోర్టు విస్మరించిందని పిటిషన్​లో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు, పంచనామా సాక్షులు, ప్రధాన సాక్షులు చెప్పేది సాధారణంగా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి.. అందరి ప్రధాన విచారణ పూర్తయ్యాకే క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అనుమతించాలని కోరారు. రేవంత్ రెడ్డి పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 18కి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి : పిల్లలపై కొవాగ్జిన్​ ఫేజ్​-2 క్లీనికల్​ ట్రయల్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement