Friday, November 22, 2024

ప్రజలంతా TRS వైపే.. పదవులు రాని వారికి అవకాశాలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా TRS వైపే వున్నారని చెవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. 9వ సారి రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా సీఎం కేసిఆర్ ఎన్నికైనందున ఆయనకు అభినందనలు తెలిపారు. బండ్లగూడ జగీర్ లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజేంద్రనగర్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి స్థానిక ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీలు పార్టీని పటిష్టపరిచాలని సూచించారు. పార్టీ పదవులు రానివారు బాధపడొద్దన్న ఆయన.. త్వరలో వారికి మంచి అవకాశాలు వస్తాయన్నారు. పార్టీ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 60 లక్షల సభ్యత్వం వున్న అతి పెద్ద ప్రాంతీయ పార్టీ TRS అని తెలిపారు. నవంబర్ 15న వరంగల్ లో నిర్వహిస్తున్న విజయగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుండి ప్రతి నాయకుడు,కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రావాలని కోరారు.

ఇది కూడా చదవండి: సామాన్యుడిని పెళ్లాడిన రాజకుమారి.. రాచ‌రిక‌పు హోదాకు దూరం!

Advertisement

తాజా వార్తలు

Advertisement