Tuesday, September 17, 2024

MBNR: బీసీ బాలికల వసతిగృహాన్ని సందర్శించిన ఎంపీ మల్లురవి

జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరిత తిరుపతయ్య
విద్యార్థినీలతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన ఎంపీ డా.మల్లు రవి

గద్వాల (ప్రతినిధి) జూన్ 21 (ప్రభ న్యూస్) : గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ లోని ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహాన్ని జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్యతో కలిసి నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి సందర్శించారు. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులతో పాటు హాస్టల్ గదులు, మరుగుదొడ్లు, భోజన శాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలు మల్లు రవి చేతులమీదుగా అందజేశారు.

వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని, సమస్యలను జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకుడు గంజిపేట్ శంకర్, ధరూర్ జెడ్పిటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, ఓబీసీ అధ్యక్షుడు నల్లారెడ్డి, కౌన్సిలర్లు నరహరి గౌడ్, ఎల్లప్ప, మహ్మద్‌ ఇసాక్, నాగేంద్ర యాదవ్, డీటీడీసీ నర్సింహులు, పులిపాటి వెంకటేష్, తుమ్మల నర్సింహులు, మాల శ్రీనివాసులు, నాగ శంకర్, కొటేష్, అచ్చన్న గౌడ్, బంగీ సుదర్శన్, ఆనంద్ గౌడ్, కొత్త గణేష్, నాగులు యాదవ్, కృష్ణయ్య గౌడ్, కమ్మరి రాము, కరాటే సత్యం, ఇమ్మనేయిల్, కుమారి నారాయణ, డీబీసీడీఓ శ్వేత ప్రియదర్శిని, హాస్టల్ వార్డన్ ప్రమీల, జయరాం నాయక్, మధుసూదన్, తదితరులు ఉన్నారు.


దౌలత్ టీ స్టాల్ నందు టీ తాగిన ఎంపీ మల్లు రవి..
గద్వాల పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర గల దౌలత్ టీ స్టాల్ దగ్గర పలు కార్యక్రమాలకు వెళ్తున దారిలో జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరితమ్మ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి టీ తాగి టీ స్టాల్ యజమానితో సన్మానం పొందారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement