Tuesday, November 26, 2024

అధిష్టానంపై కోపం లేదు.. మేమంతా కలిసే పనిచేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి యూటర్న్

తెలంగాణ పీసీసీ చీఫ్  పదవి దక్కకపోవడంతో అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానంపై తనకెలాంటి కోపం లేదన్నారు. తనకు పీసీసీ రాలేదని కోపంలో కొన్ని మాటలు అన్నానని, వాటిని పట్టించుకోనవసరం లేదన్నారు. తామంతా కలిసే పనిచేస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని అన్నారు. హుజురాబాద్ నుంచే దళిత బంధు ప్రారంభించడం వెనక మతలబేంటని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

కాగా, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇకపై గాంధీ భవన్ మెట్లేక్కెనని శపథం చేశారు. ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీ పోస్టుగా మారిందని విమర్శలు చేశారు. పార్టీలు మారినవాళ్లకే కాంగ్రెస్ లో పదవులు వస్తాయని అన్నారు. రాష్ట్ర పీసీసీ పోస్టు అమ్ముడుపోయిందని, తాను కూడా నాలుగు పార్టీలు మారితే, కేసుల్లో ఉంటే పోస్టు వచ్చేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండిః మంత్రి కేటీఆర్ కు చుక్కలు చూపించిన యూత్ కాంగ్రెస్

Advertisement

తాజా వార్తలు

Advertisement