నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : దుబాయ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షత గాత్రులను భారత్ కు రప్పించాలని కేంద్ర మంత్రి జయశంకర్ ను ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు.
దుబాయిలో రెండు రోజుల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో భారత్ కు చెందిన కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. దుబాయ్ లోని ధర్వేష్ కంపెనీలో పనిచేసే 75 మంది కార్మికులు అజ్మన్ నుండి ఖోర్ ఫక్కన్ కు బస్సులో వెళ్తుండగా ఆకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన పలువురి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని వాపోయారు. క్షతగాత్రుల్లో భారతదేశానికి చెందిన వారిని వెంటనే రప్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు.