నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : మాజీ మంత్రి కేటీఆర్ చేసింది మంచిపని కాదని, దోపడీ, దొంగతనమని ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరుకాకపోవడాన్ని ఎంపీ అరవింద్ తప్పుబట్టారు.
సంవత్సరాల తరబడి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిన కేసీఆర్ కుటుంబం చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతదన్నారు.