హైదరాబాద్ – న్యూ ఇయర్‌కు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత వారం ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు.
దీంతో కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప కార్యక్రమాలు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఏడు రోజులు అన్ని పార్టీ కార్యక్రమాలు రద్దు చేసుకుంది.ఈ తరుణంలో మన్మోహన్ సింగ్ సంతాప దినాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలకు హాజరు కావద్దని నిర్ణయం తీసుకుంది. వేడుకలకు దూరంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉండనున్నారు.