Saturday, November 23, 2024

Motkuru – జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికైన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధినులు

మోత్కూర్ ,అక్టోబర్ 11( ప్రభ న్యూస్) 2022- 23 విద్యాసంవత్సరం లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు అందించే జాతీయ ఉపకార వేతనాలు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ జి.ప్రభ జస్టిస్ బుధవారం విలేకరులకు తెలిపారు.కళాశాలలో గత విద్యా సంవత్సరంలో బైపిసి ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన పురుగుల మౌనిక ,ఎల్లబోయిన మేఘన, జిట్ట వెన్నెల లు ఉపకార వేతనానికి అర్హత సాధించినట్లు తెలిపారు.

విద్యార్థినిలు మౌనిక ,మేఘన లు బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం అడ్మిషన్ పొందగా, వెన్నెల నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ లో ప్రవేశం పొందింది.ఎంపికైన విద్యార్థులకు డిగ్రీ పదమ సం. లో రూ.30 వేలు,ద్వితీయ సం.లో రూ. 40 వేలు, తృతీయ సo.లో రూ. 50 వేలు,పీజీ ప్రధమ సం.లో 60 వేలు ద్వితీయ సంవత్సరంలో రూ. 70 వేల చొప్పున 5 సంవత్సరాలకు ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల 50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఉన్నత చదువుల కోసం ఉపకార వేతనాన్ని అందిస్తుందని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనాలు పొందవచ్చన్నారు.ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ ప్రభ జస్టిస్ తోపాటు, అధ్యాపక బృందం అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement