Tuesday, November 19, 2024

కూతురికి అన్యాయం – తల్లి ఆత్మహత్య

గన్నేరువరం, జూన్ 17 (ప్రభన్యూస్): తన కూతురికి అన్యాయం జరిగిందని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన గన్నేరువరం మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన బండి సరవ్వ సమ్మయ్యలకు ఇద్దరు కూతుళ్ళు ఒక కుమారుడు వున్నారు. పెద్ద కూతురికి పెళ్లి కాగా చిన్న కూతురు లత అదే గ్రామానికి చెందిన చాడ బాపిరెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుట్టున్నారు

. లత గిరిజన అమ్మాయి కావడంతో బాపిరెడ్డి ఇంట్లో పెళ్లికి వారి తల్లిదండ్రులు ఒప్పుకో పోగా బాపిరెడ్డికి వేరే అమ్మాయితో ఈనెల ఒకటి న వివాహం జరిపించారు. బాబిరెడ్డి వివాహం చేసుకున్నప్పటికీ తాను ప్రేమించిన లతను కూడా పెళ్లి చేసుకుంటానని తను లేకపోతే బతకలేనని నమ్మించి ఈనెల 12న లతను తన వెంట తీసుకెళ్లాడు. మరుసటి రోజు లత తల్లిదండ్రులు తన కూతురు కనిపించడం లేదంటూ గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు పెట్టిన విషయం తెలుసుకున్న బాపిరెడ్డి లతను గ్రామంలో వదిలి వెళ్ళాడు. దీంతో తనను మళ్ళీ మోసం చేశాడని లత బావిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. స్థానికులు చూసి లతను వెంటనే రక్షించారు

. తన కూతురి జీవితం అగ్రవర్ణాల యువకుడు చేసిన మోసానికి గురైందని మనస్థాపానికి చెందిన యువతి తల్లి బండి సరవ్వ శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తరలించి మృతికి కారకులైన బాపిరెడ్డి ఇంటి ముందు మృతదేహాన్ని మృతురాలి బంధువులు వేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు .అప్పటికే బాపిరెడ్డి తన కుటుంబ సభ్యులతో సహా ఇంటికి తాళం వేసి పారిపోయారు

- Advertisement -

.దీంతో తనను మోసం చేసి తన తల్లి మృతికి కారకులైన బాపిరెడ్డిని వెంటనే శిక్షించి తనకు న్యాయం చేయాలని లేదంటే బాబిరెడ్డితో తనకు వివాహం జరిపించాలని బాపిరెడ్డి ఇంటి ముందు భీష్ముంచుకొని కుటుంబ సభ్యులతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ సురేందర్ యువతి తో మాట్లాడి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాపిరెడ్డి ఇంటి ముందు ఆందోళన విరమింప చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement