Wednesday, September 18, 2024

TG: మదర్ డెయిరీ ‘హస్త’ గతం… ఆరుకు ఆరు కాంగ్రెస్ వే..

.. సంబురాల్లో చైర్మెన్లు
..రైతుల విజయంగా అభివర్ణించిన ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్య


ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తి సహకార సంఘం మదర్ డెయిరీ (నార్ముల్) హస్తగతం చేసుకుంది.. శుక్రవారం ఎన్నికల ఫలితాల్లో ఆరు డైరెక్టర్లకు గాను ఆరు డైరెక్టర్లు కాంగ్రెస్ బలపర్చిన వారే విజయం సాధించారు.

కాంగ్రెస్ నుంచి కల్లేపల్లి శ్రీశైలంకు 222, గుడిపాటి మధుసూదన్ రెడ్డికి 229, పుప్పాల నర్సింహులు 181, బత్తుల నరేందర్ రెడ్డి 177, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు సందిల భాస్కర్ 104, కొండల్ రెడ్డి కి 110, ఒగ్గు బిక్షపతి కి 71, దొంతిరి సోమిరెడ్డికి 76 ఓట్లు వచ్చాయి.

- Advertisement -

రంగారెడ్డి నుంచి మండలి జంగయ్య యాదవ్, అగ్రలా నర్సింహారెడ్డిలు భారీ మెజారిటీతో గెలుపొందారు. మదర్ డెయిరీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని, ప్రభుత్వ మద్దతుతో ముందుకు సాగుదామని, ఇది రైతుల విజయంగా ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభివర్ణించారు. బాణాసంచా కాలుస్తూ సంబురాలను జరుపుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement