ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తి సహకార సంఘం మదర్ డెయిరీ (నార్ముల్ ) ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి.. శుక్రవారం హోరాహోరీగా కొనసాగుతుండగా 296 ఓట్లకు గాను ప్రస్తుతం 292 ఓట్లు పోలయ్యాయి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ మాజీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. ఎన్నడూ లేని విధంగా 98శాతానికి పైగా పోలింగ్ జరుగగా అధిక సంఖ్యలో మహిళా చైర్మెన్లు పాల్గొన్నారు. 1 గంటకు పోలింగ్ ముగియనుండగా, మధ్యాహ్నం 2గంటల నుండి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానున్నది. ఎన్నికల్లో ప్రలోభాలు, తాయిలాలతో చైర్మెన్లకు బంపర్ ఆఫర్ వచ్చిందనే చెప్పవచ్చు.. కాసేపట్లో ఎన్నికల రిజల్ట్ బయటపడనుంది.
- Advertisement -