Thursday, November 28, 2024

NZB | వడ్డీ వ్యాపారులను వెంటనే శిక్షించాలి..

  • బాధితులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు..
  • వడ్డీ వ్యాపారుల తీరుపై భగ్గుమన్న ఆర్యవైశ్య నాయకులు
  • ఆత్మహత్య ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న రోషన్ పై పార్టీ సస్పెన్షన్ వేటు


నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్ 7 (ఆంధ్రప్రభ) : అధిక వడ్డీ వసూలు చేయడమే కాకుండా ఆపై దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురిచేసి ఆడబిడ్డలతో దుర్భాషలాడి తండ్రీ కూతుర్ల మృతికి కారకులైన వడ్డీ వ్యాపారులను వెంటనే శిక్షించాలని ఆర్యవైశ్య నాయకులు డిమాండ్ చేశారు. ఆర్యవైశ్యుల జోలికి వస్తే ఊరుకోం ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక తీవ్ర మనస్థాపానికి గురై ఓ కుటుంబం బాసర గోదావరి నదిలో దూకగా తండ్రి, కూతుర్లు బలైన విషయం విధితమే. ఆ దంపతులు కూతురుతో సహా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే స్థానికులు గమనించి అనురాధను కాపాడగా తండ్రీ కూతుర్లు చనిపోయారు.

తమకు జరిగిన అన్యాయాన్ని అనురాధ పోలీసులకు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తీసుకున్నా అప్పుకు చెల్లించడానికి వారం సమయం ఇవ్వమని బతిమాలుకున్నా వడ్డీ వ్యాపారి భయభ్రాంతులకు గురిచేసి కూతురు, తల్లితో అసభ్యకరంగా మాట్లాడినట్టు అనురాధ పోలీసులతో వాపోయింది. గురువారం నిజాంబాద్ నగరంలోని నాల్కల్ రోడ్డు ప్రాంతంలో ఉప్పలంచ వేణు కుటుం బానికి మేము అండగా ఉంటాం అంటూ వారి నివాసం వద్ద ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ… ఉప్పలంచ వేణు కుటుంబం సామాన్య కుటుంబమ‌ని తెలిపారు.

- Advertisement -

చిరు వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్న ఆ కుటుంబంపై వడ్డీ వ్యాపారి కాలనాగులా కాటేయడంపై మండిపడ్డారు. తీసుకున్న అప్పు చెల్లించడానికి వారం రోజుల సమయం గడువు ఇవ్వాలని కోరిన దయ తలచకుండా వడ్డీ వ్యాపారులు ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. తండ్రి కూతుళ్ళ మృతిపై పోలీస్ శాఖ వెంటనే పూర్తి విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించే వరకు త‌మ పోరాటం ఆగదని ఆర్యవైశ్య సంఘ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని తండ్రి, కూతుర్ల ఆత్మహత్య ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కంటేశ్వర్ మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రోషన్ ను బిజెపి పార్టీ సస్పెన్షన్ చేసినట్లు గురువారం జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement