Friday, November 22, 2024

TS: ప్రధాని పదవికే కళంకితం తెచ్చేలా మోడీ ప్రకటనలు.. మంత్రి పొన్నం ప్రభాకర్

..రెండు విడతల పోలింగ్ తో అసహనం
…రిజర్వేషన్ల తొలగింపునకు కుట్ర
..సిరిసిల్ల చేనేతకు బండి ఏమి చేశారు
..మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

సిరిసిల్ల, మే 1 (ప్రభన్యూస్) : గత వారం రోజులుగా ప్రధాన మంత్రి ప్రకటనలు చూస్తే ప్రధాని పదవికే కళంకితం తెచ్చే విధంగా దిగజారి మాట్లాడుతున్నారని, మొదటి, రెండవ దశ పోలింగ్ ఎన్నికల తరువాత ప్రధాన మంత్రి మోడీ వైఖరి లో పూర్తిగా అసహనం వచ్చిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఉత్తర, దక్షిణ భారత దేశంలో జరిగిన పోలింగ్ లో బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి నరేంద్ర మోడీ ప్రకటనలే కారణమన్నారు. 30 సంవత్సరాల తరువాత బీజేపీ కి స్పష్టమైన మెజారిటీ వచ్చిందని, అంత మెజారిటీ వచ్చినా అబ్ కి బార్ చార్ సౌ అంటున్నారని, దేశంలో ఉన్న మేదావులు , ప్రజాస్వామిక వాదులు ఆలోచించాలన్నారు.

దేశంలోని సంపద అంతా అదానీ, అంబానీ లకు అప్పగిస్తున్నారని, మోడీ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, ప్రధాన మంత్రి 400 సీట్లు గెలుచుకుంటే బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి ఎస్సి, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తొలగించవచ్చని చూస్తున్నారన్నారు. మూడవ వంతు అంటే 543 ఎంపీల్లో 400 మెజారిటీ ఉంటే రాజ్యాంగాన్ని మార్చవచ్చుని చూస్తున్నారని, భవిష్యత్ లో నియంతలాగ ఉండాలని చూస్తున్నారన్నారు. దేశ సంపద అంతా అదానీ, అంబానీలకు గుజరాత్ కుటుంబాలకు లకు అప్పగించాలని చూస్తున్నారని, దేశంలో దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు ఉండకుండా చూడాలనీ చేస్తున్నారన్నారు. అందుకే ఆ ఆలోచనతో అబ్ కి బార్ చార్ సౌ అంటున్నారని పేర్కొన్నారు. నిజానికి క్షేత్ర స్థాయిలో బీజేపీకి ఎవరు ఓటు వేయడం లేదని, గతంలో 4 లక్షల మెజారిటీతో గెలిచిన సీట్లు కూడా ఇప్పుడు 50 వేలు, లక్ష తో ఓడిపోతున్నాయని ఇంటెలిజెన్స్ సర్వేలు చెబుతున్నాయని వెల్లడించారు.

దేశంలో కాంగ్రెస్ వస్తె ఆస్తులు ముస్లింలకు ఇస్తారని అంటున్నాడని, మంగళ సూత్రాలు గుంజుకుంటారని అంటున్నాడని, ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి అర్బన్ నక్సలిజం వస్తుందని, హనుమాన్ చాలీసా చదవనివ్వమని అంటున్నాడని దుయ్యబట్టారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు ఎవరు బీజేపీ వైపు లేరని, నిన్న రాష్ట్రానికి వచ్చిన మోడీ జహీరాబాద్ లో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని అంటున్నారని, ప్రధాన మంత్రి స్థాయికి ఎంత దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలోని 11లక్షల కోట్ల సంపద ఎల్ఐసి, ఎయిర్పోర్ట్, పోర్టులు, బిఎస్ఎన్ఎల్ తో సహా అదానీ, అంబానీ లకి అప్పగించింది వాస్తవం కాదా ప్రశ్నించారు. బీజేపీ ఒక్క సీటు గెలిచిన భవిష్యత్ కాలంలో ఎస్సి, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ఉండవని స్పష్టం చేశారు. ఆనాడు మండల కమిషన్ తెస్తే అద్వానీ కమండల్ పేరుతో యాత్ర చేసి దేశం మొత్తం అల్లకల్లోలం చేసింది వాస్తవం కాదా అని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈదేశంలో రిజర్వేషన్ రహిత భారతదేశం తెస్తామన్నది వాస్తవం కాదా అన్నారు. రాహుల్ గాంధీ దేశంలో ఉత్త్నా అబాది ఇత్నా ఇచాదరి అంటే కుల గణన చేస్తామంటే దానికి వ్యతిరేకంగా కేంద్ర బీజేపీ నాయకత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కూడా దళితుల రిజర్వేషన్లు అవమానకరంగా మాట్లాడింది వాస్తవం కాదా అన్నారు. బీజేపీ ఫ్యూడలిస్ట్ ల పార్టీ, వ్యాపారస్తుల పార్టీ అని, దేశం మొత్తం మీద 30-40 లక్షల ఖాళీలున్న ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, రిజర్వేషన్ల ద్వారా వస్తారని యూపీపీఎస్సీ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ లకు సంబంధించి రిజర్వేషన్లు ఇవ్వడం లేదని పార్లమెంట్ సాక్షిగా జవాబు చెప్పారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మన హక్కులు కాపాడుకోవడానికి రిజర్వేషన్లు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కోరుతూ రిజర్వేషన్ల తొలగింపు కు కుట్ర జరుగుతోందన్నారు.

- Advertisement -

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం..
2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ అందిస్తున్నామని అందిస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని,10 లక్షల ఆరోగ్య శ్రీ ఇచ్చామని, రేషన్ కార్డులు ఇస్తామని, 4000 పెన్షన్ ఇస్తాం.. పెన్షన్ లేని వారికి కొత్తగా వచ్చే వారికి కూడా పెన్షన్ లు ఇస్తామని మంత్రి వెల్లడించారు. కేంద్రం నుండి నిధులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ని గెలిపించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తేనే ఇవన్నీ పథకాలు అమలు చేయడానికి ఉంటుందనీ, కార్యక్రమాలు కొనసాగాలన్న.. మరింత అభివృద్ధి జరగాలన్న కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండనీ అభ్యర్థించారు. బీజేపీ , బీఆర్ఎస్ లకు ఓటు వేసి వృదా చేసుకోవద్దని, దేశంలో నియంత్రుత్వనికి వ్యతిరేకంగా, త్యాగాల ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించిన కుటుంబం నుండి మానవతావాది రాహుల్ గాంధీ నాయక్వత్వాన్ని బలపరుద్దామన్నారు. దేశాన్ని ముందుకు తీసుకుపోదామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామన్నారు.

ఎన్నికల కోడ్ ముగియగానే నేతన్నలకు…
ఎన్నికల కోడ్ అయిపోగానే సిరిసిల్ల చేనేత కార్మికుల కు గత 10 సంవత్సరాలుగా ఇచ్చిన ప్రణాళిక కన్న మంచిగా ప్రణాళిక అమలు చేస్తామని, ప్రతి కార్మికుడు ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని, మహిళా సంఘాలకు బలోపేతం చేస్తూ వారికి వడ్డీలేని రుణాలు ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేతి వృత్తులకు ప్రోత్సహిస్తున్నామనీ హామీ ఇచ్చారు. పరిశ్రమ కాపాడుకోవడమే కాదు మంచి.. భవిష్యత్ లో సిరిసిల్ల రికగ్నైజ్ బ్రాండ్ క్రియేట్ చేస్తామని మంత్రి తెలిపారు. 3వ తేది ముఖ్యమంత్రి వస్తున్నారు. ఈ ప్రాంత సమస్యల పై వారికి అవగాహన ఉంది. సిరిసిల్ల సభను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి చేనేత పై జీఎస్టీ విధించిందని, సిరిసిల్ల క్లస్టర్ ను వరంగల్ కి తరలించారనీ, సిరిసిల్ల చేనేత కి బండి సంజయ్ ఏం చేశారో నూతన చౌరస్తాలో చర్చకు రావాలనీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఆనాడు టెస్కో ద్వారా మహిళలకు స్వయం సమృద్ధి అవకాశాలు కల్పించామాన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని.. సిరిసిల్ల లో మరింత మెజారిటీ రావాలన్నారు. సిరిసిల్ల పట్టణంలో మంచి స్పందన వచ్చిందన్నారు. వారంతా కాంగ్రెస్ అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ లో మరింత ఉత్సాహంగా పనులు కొనసాగిస్తామని వెల్లడించారు. పార్లమెంట్ సిట్టింగ్ సభ్యులు నియోజకవర్గానికి ఏం పని చేశారో చెప్పాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement