Tuesday, November 26, 2024

Modi’s Birthday – మెగా వైద్య శిబిరం విజయవంతం

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ (ప్రభ న్యూస్)17:నిజామాబాద్ నగరంలో ప్రధానమంత్రి మోడీ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయ వంతం అయిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.ఆదివారం నిజామా బాద్ నగరంలో హరి చరణ్ పాఠశాల బస్టాండ్ పక్కన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చింది.

ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్య నారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా పేదల కోసం ప్రవేట్ ఆసుపత్రికి వెళ్లలేని స్థితిలో ఉన్న వారికి ప్రవేట్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మోదీ ఆశయా లను పేద ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారి జీవితాల్లో కన్నీరు చూడకుండా ఉండడమే మోదీ అంతిమ లక్ష్యం అన్నారు. పేద ప్రజల సమస్యల మీద డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధగా చూశారన్నారు. వారికి సరైన మందులు ఇచ్చిఆ దుకున్నారన్నారు మోడీ జన్మదినాన్ని నగరంలో ఘనంగా నిర్వహించమన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మీనా రాయణ, న్యాలం రాజు, అసెంబ్లీ కన్వీనర్ పంచ రెడ్డి లింగం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ ,కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, పంచారెడ్డి ప్రవళిక, మండల అధ్యక్షులు రోషన్ లాల్ బోర, గడ్డం రాజు, పుట్టా వీరేందర్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు కైసర్, సీనియర్ నాయకులు భరత్ భూషణ్, షీలా శ్రీనివాస్, బట్టికారి ఆనంద్, పవన్ ముందడ మారెడ్డి వనిత, సురేష్ అసెంబ్లీ కన్వీనర్ చిరంజీవి ,సురేష్ ప్రముఖ వైద్యులు డాక్టర్ వినయ్ ధన్ పాల్ డాక్టర్ రాఘవేంద్ర డాక్టర్ సంధ్య ఆలపాటి డాక్టర్ సందీప్ రావు డాక్టర్ అలోక్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement