Saturday, November 23, 2024

మ‌రి కొద్దిసేప‌టిలో హైద‌రాబాద్ లో మోడీ ప‌ర్య‌ట‌న‌… అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీ మ‌రికొద్ది సేప‌టిలో హైద‌రాబాద్ లో కాలుమోప‌నున్నారు.. తెలంగాణాలో రూ.11,355 కోట్లతో కేంద్ర ప్ర‌భుత్వ చేప‌ట్టిన వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను, ప‌నుల‌ను ప్రారంభించ‌నున్నారు. అలాగే ప‌రేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తారు.. మోడీతో పాటు ఈ కార్య‌క్ర‌మాల‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణ‌వ్ అశ్విన్ , టూరిజం శాఖ మంత్రి జి కిష‌న్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొంటారు.. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ నాయ కులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. . అందుకోసం పార్టీ తరఫున స్వాగత తోరణాలు, కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు..

https://twitter.com/BJP4Telangana/status/1644538613739446272
ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న షెడ్యూల్..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.45 గంటలకు రోడ్డు మార్గాన‌ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. 11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ రైలు పరిశీలిస్తారు. మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్‌ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు. 11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగిస్తారు.. 12.37 నుంచి 12.50 మధ్య రిమోట్‌ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాలను న‌రేంద్ర మోడీ ఆవిష్కరిస్తారు.. వాటిపై తీసిన షార్ట్‌ వీడియోల ప్రదర్శనను తిల‌కిస్తారు. 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.. 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని చెన్నైకి వెళ‌తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement