Tuesday, November 19, 2024

TS : మోదీ తీపి క‌బురు… తెలంగాణకు175 ఎకరాల రక్షణ భూమి….

తెలంగాణ‌కు ప్ర‌ధాని మోదీ తీపి క‌బురు అందించింది. కేంద్ర రక్షణ శాఖ 175 ఎకరాల రక్షణ శాఖ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీంతో రోడ్లు, ఎలివేటర్ కారిడార్ల నిర్మాణంలో ఇబ్బందులు తొలగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి.

ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 5న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విషయాన్ని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలంగాణ సీఎంవో తెలిపారు. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రక్షణ శాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరగా కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని సీఎంఓ వివరించారు. తమ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు గాను కిషన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 44వ నెంబరు జాతీయ రహదారి (కామారెడ్డి మార్గం), రాష్ట్ర రహదారి నంబర్ 1లో ఎలివేటెడ్ కారిడార్లు, సొరంగాల నిర్మాణం సులభతరం కానుందని కిషన్ రెడ్డి తెలిపారు. మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రజా జీవనాన్ని సులభతరం చేస్తామని పదేళ్లుగా దేశ ప్రజలకు అందిస్తున్న హామీకి ఇదో ఉదాహరణ అని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండలను కలుపుతూ రాజీవ్ రహదారిపై నిర్మించనున్న 11.3 కిలోమీటర్ల పొడవునా ఎలివేటెడ్ కారిడార్ కోసం భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందులో కొంత భూమి రక్షణ శాఖ పరిధిలో ఉంది. ఈ విషయమై కేంద్ర రక్షణ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపడంతో.. కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement