ఆశావాహులు నలుగురు
దక్కింది ఇద్దరికే
ఉభయ రాష్ట్రాల మహిళలకు దక్కని బెర్త్
కేంద్ర కేబినెట్ ఒక్క కొలికి వచ్చింది. తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు మంత్రి పదవులు లభించాయి. ఉభయ రాష్ట్రాల్లో ఇద్దరు మహిళలు మాత్రమే ఎంపీ లుగా ఎన్నికయ్యారు. ఒక మహిళకు మంత్రి పదవి వరిస్తుందని అందరూ ఊహించారు. ఉభయ రాష్ట్రాల మహిళలకు మంత్రి పదవి దక్కలేదు.
కిషన్, బండిలకు దక్కిన పదవులు
కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ సాయంత్రం కొలువుదీరనున్నది. కేబినెట్లో బెర్త్‌లపై అందరి దృష్టి పడింది.
ప్రతి పది మంది ఎంపీలకు ఒక మంత్రి పదవి కేటాయించాలని, అలాగే భాగస్వామ్య పార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇవ్వడానికి ఎన్డీఏ నిర్ణయించిందని తెలియడంతో రాష్ట్రానికి ఒకరికి చోటు దక్కుతుందని అందరూ ఊహించారు. అందరి ఊహాలకు భిన్నంగా ఇద్దరికి మంత్రి పదవులు లభించాయి. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రి పదవులు వరించాయి.
ఆశావాహులు నలుగురు
తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు ఆశావాహులు ఉన్నారు. ఆశించిన వారిలో కేంద్ర మాజీ మంత్రి, పార్టీ చీఫ్, సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి రెండోసారి ఎన్నికైన కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్, కరీంనగర్ నుంచి రెండోసారి ఎన్నికైన బండి సంజయ్, మమబూబ్‌నగర్ నుంచి ఎన్నికైన రాష్ట్ర మాజీ మంత్రి డి.కె.అరుణ, మెదక్ నుంచి ఎన్నికైన రఘునందన్ రావు కేబినెట్ పదవుల ఆశించిన వారిలో ఉన్నారు. అయితే కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కిషన్ రెడ్డికి ఉంది. కిషన్‌రెడ్డితోపాటు రెండోసారి ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్‌కి కూడా మంత్రి పదవి దక్కింది.
డీకే ఆశలు ఆడియాశలు
మహబూబ్‌నగర్ ఎంపీ, రాష్ట్ర మాజీ మంత్రి డి.కె.అరుణ ఆశలు ఆడియాశలయ్యాయి. ఈ సారి కేబినెట్లో పదవి దక్కించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించ లేదు. ఆంధ్ర, తెలంగాణలో చెరో ఒక్కో స్థానంలో మహళలు ఎంపీగా విజయం సాధించారు. ఆంధ్రలో భాగస్వామ్య పార్టీలకు మంత్రి పదవులు వరిస్తున్నాయని తెలియడంతో మహిళ కోటా కింద డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆమె అభిమానులు ఆశించారు. కానీ అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలోనూ మహిళలకు బెర్త్‌లు దక్కలేదు.
పార్టీ పదవిపై కన్ను
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఖరారు కావడంతో అధ్యక్ష పీఠం మార్పు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు. గతంలో రాష్ట్ర పదవి నిర్వర్తించిన బండి సంజయ్ కి కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించింది. అయితే ఇప్పటి వరకు మంత్రి పదవులు ఆశించిన డీకే అరుణ, రఘునందన్ రావుతోపాటు మరి కొంత మంది దృష్టి సారించారు. కేంద్రంలో ఎన్డీఏ కొలువుదీరిన తర్వాత పార్టీ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభిస్తారని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.