Saturday, November 23, 2024

మోడీ అంటేనే మోసాలు.. అట్ల‌యితే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌న్న మ‌ల్లారెడ్డి

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: బీజేపీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేసింది.. దేశాన్ని దోచిన దొంగలు విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తుంటే కేంద్రం దేశంలోని పేదలకు పన్నుల భారం మోపుతున్నది. అసలు మోడీ అంటేనే మోసాలు.. నంబర్‌ వన్‌ కేడీ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. శుక్రవారం హనుమకొండలోని తారా గార్డెన్‌లో జరిగినటువంటి కార్మిక మాసోత్సవ సదస్సు మంత్రి మల్లారెడ్డితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ అంటేనే జూటా పార్టీ అని విమర్శించారు. శ్రీ భద్రకాళీ అమ్మవారిని బీజేపీ కౌరవుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలని మొక్కుకున ్నట్లు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు. కేసీఆర్‌ను ప్రధాన మంత్రిని చేయమని శ్రీ భద్రకాళీ అమ్మను మొక్కుకున్నట్లు తెలిపారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళిత బంధు పథకం అమలు చేస్తే నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ నేతలకు స వాల్‌ విసిరారు.

తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత ంాష్ట్రాల్లో అమలు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు సవాల్‌ విసాింరు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, వీళ్లందరు నడవంతరపు దొంగలు.. చెడగొట్టుగాళ్ళు అని మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ఇద్దామని, దేశంలో బీజేపీ తుడిచిపెట్టుకపోవడం ఖాయమని, కేసీఆర్‌ దేశ్‌కి నేత అవుతారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కొత్తబిచ్చగాడిలా రేవంత్‌రెడ్డి ఎగురుతున్నాడని విమర్శించారు.

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు కార్మికులను నాశనం చేశాయి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు కార్మికులను నాశనం చేశాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు అంటే చాలు వాళ్లను ఇబ్బంది పెడుతుందన్నారు. కాజీపేట రై ల్వేకోచ్‌ ఫ్యాక్టరీ వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేవి.. కాంగ్రెస్‌, బీజేపీ అవి మనకు దక్కకుండా తొక్కిపడేశాయన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు కార్మికులను నాశనం చేశాయన్నారు. బీజేపీ ప్రైవేట్‌ వ్యవస్థను తీసుకొస్తున్నదని, అన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారని మంత్రి అన్నారు. దీనివల్ల వచ్చే రోజుల్లో కార్మికులకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా ఉద్యోగాలు రాకుండా కేంద్రం అన్యాయం చేస్తున ్నదన్నారు. వ్యవసాయరంగాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని, నల్ల చట్టాలు తెచ్చి రైతుల నడ్డి విరువాలని చూసిందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆ నల్లచట్టాలను అడ్డుకున్నారన్నారు. రైతులు ఎదురు తిరిగే సరికి తప్పు ఒప్పుకొని మోడీ తోక ముడిచాడని విమర్శించారు.

ప్రభుత్వం కార్మికులకు ఇచ్చే టూ వీలర్లల్లో వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు 10 వేల సైకిల్‌ మోటార్లను ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సీఎం కేసీఆర్‌ కార్మిక పక్షపాతికార్మికుల సంక్షేమానికి నిజాయితీగా పనిచేస్తున్న సీఎం దేశంలో కేసీఆర్‌ మాత్రమే ఉన్నారన్నారు. కార్మికుల కోసం సీఎం కేసీఆర్‌ చేపట్టిన భీమా వంటి అనేక పథకాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వివరించారు. కార్మికులు అంతా సీఎం కేసీర్‌కు అండగా నిలువాలని మంత్రి దయాకర్‌రావు కోరారు. ఈ సందర్భంగా కార్మికుల కోసం చేపట్టిన కార్యక్రమాలను మంత్రి వివరించి చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ను అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement