- మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీల మాట మంతి
- కలిసికట్టుగా పనిచేయాలని సూచన
- మోదీ హితవుపై కేటీఆర్ సెటైర్లు
- కాంగ్రెస్ తో కలసి మరీ పనిచేస్తున్నారంటూ వ్యాంగాస్త్రాలు
- మీ చోటే బాయ్ కు వ్యూహకర్తలే మీ వాళ్లు
- రేవంత్ మీద ఈగ వాలనియ్యని ధీరులు మీ ఎంపీలు
హైదరాబాద్ – ప్రధాని మోదీ న్యూఢిల్లీలో బుధవారం తెలంగాణ బీజేపీ ఎంపీలతో భేటి అయ్యారు.. ఈ సందర్భంగా తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అక్కడి నేతలంతా కలిసికట్టుగా పని చేయాలంటూ సూచించారు.. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ ఖాతా ద్వారా మోదీ పై సెటైర్లు వేశారు.. ఇక్కడ మీ ఎంపీలు కలసికట్టుగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారంటూ చురకలంటించారు.. మీ చోటే బాయ్ కు వ్యూహకర్తలు మీ వాళ్లే మోదీ. అంటూ సమాచారం ఇచ్చారు. రేవంత్ పై ఈగ కూడా వాలనీయకుండా మస్త్ గా చూస్తున్నది మీ కమలనాధులే అంటూ బాంబు పేల్చారు. పిల్లలు చనిపోయినా, రైతుల గుండెలు పగిలినా, గిరిజనులను చెరపట్టినా చప్పట్లు కొట్టేది మీ నేతలేనంటూ విశ్లేషించారు కేటీఆర్.
మోడీ గారూ.. కలిసికట్టుగానే పని చేస్తున్నారు మీ కమలంనేతలు
కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పని చేస్తున్నారు!
చోటేభాయ్ కు వ్యూహకర్తగా…
కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా..
విశ్రమించకుండా పని చేస్తున్నారు!
చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం
‘చేతి’ కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని చేస్తున్నారు!
ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరుమెదపరు!
రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు!
హైడ్రా మంచిదంటారు, మూసి కావాలంటారు, ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు!
పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా, చప్పట్లు కొడతారు!
తెలంగాణలో వారి (హస్తం) చేతిలోనే కమలం ఉంది! జాగ్రత్తగా! భద్రంగా!