నిర్మల్ ప్రతినిధి నవంబర్ 26 ప్రభా న్యూస్ ) రాష్ట్రంలోనే నిర్మల్ కొయ్య బొమ్మలకు ఎంతో ప్రత్యేకత ప్రతిష్ట ఉన్నప్పటికీ సరైన ఆదరణ లేదని, తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా పరిశ్రమలు తీర్చిదిద్దుతామని దేశ ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. . ఆదివారం జిల్లా కేంద్రంలోని క్రషర్ గ్రౌండ్ వద్ద బిజెపి సకల జనుల విజయ సంకల్ప సభలో మోడీ ప్రసంగిస్తూ, దేశ ప్రజల అభ్యున్నతి కొరకు బిజెపి ఆరాటపడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యుల అభ్యున్నతి కొరకు ఆరాటపడుతున్నారని ఆరోపించారు.
దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణ ఉందని, ధరణి పేరిట కెసిఆర్ కుటుంబం రాష్ట్రంలోని విలువైన భూములను భూ కబ్జాలు చేస్తూ అందినంత డబ్బులను దండుకొని పబ్బం గడుపుకుంటుందని దుయ్యబట్టారు. అవినీతి ప్రభుత్వం కావాలో ప్రజలకు సుస్థిరత ప్రభుత్వం కావాలో ఈ ప్రాంత ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. 2024పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాయడం రావడం ఖాయం అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి సర్కార్ను అధికారంలోకి తెస్తే డబ్బులు ఇంజన్ సర్కార్తో ఎన్నో అభివృద్ధి పనులు సాధించుకోవచ్చు అని ప్రజలకు సూచించారు
ఈ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేస్తున్న నిర్మల్. ముధోల్ ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించే విధంగా సభకు వచ్చిన ప్రజలు ప్రతి ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులను ఓటు విచ్చే విధంగా ప్రార్థించాలని తనకు సభ ముఖంగా హామీ ఇవ్వాలని ప్రజలను కోరగా అందుకు ప్రజలు తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లతో లైట్ వేసి చేతులెప్పి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బిజెపి జిల్లా అధ్యక్షుడు అంజి కుమార్ రెడ్డి. బిజెపి నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్. బిజెపి అభ్యర్థులు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ రాథోర్ రమేష్ పాయల శంకర్ లు పాల్గొన్నారు.