Saturday, November 30, 2024

HBD : రేవంత్ కు మోడీ బర్త్ డే విషెష్

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి నల్లగొండి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మొదట యాదాద్రి ఆలయానికి చేరుకుని లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే సీఎం పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన ట్వీట్ లో ప్రధాని ఇలా రాసుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను అని రాసుకొచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement