సిద్ధిపేట : సిద్ధిపేట కొత్త మోడ్రన్ బస్టాండ్ ఆధునీకరణపై మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ముందు చూపుతో నిర్మాణం జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. విజన్ కు అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం ఉండాలని పనులు శరవేగంగా సాగాలని హరీశ్ రావు సంబంధిత కాంట్రాక్టరుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో శనివారం పాత బస్టాండ్- ఆవరణ, పరిసర ప్రాంతాలను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బస్టాండుకు వచ్చే ప్యాసింజర్లకు మోడ్రన్ టాయిలెట్స్, క్యాంటీన్, దుకాణ సముదాయం తగిన వసతులు కల్పించనున్నట్టు మంత్రి హరీశ్ తెలిపారు. బస్టాండులో దాదాపు 20 వరకూ ప్లాట్ ఫామ్స్ వచ్చేలా డిజైన్లకు అనుగుణంగా పనులు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పలువురు ప్రజాప్రతనిధులు, అధికారులు పాల్గొన్నారు.