సంగారెడ్డి, (ఆంధ్రప్రభ) – బాలల దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల ఒకట తేది నుంచి ఎం ఎన్ ఆర్ డెంటల్ కాలేజీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. చివరి రోజైన నేడు విద్యార్థి చిన్న వయసు నుంచి దంత సంరక్షణకై సంపూర్ణ ఆరోగ్యానికి భద్రత అనే అంశంపై అవగాహన సదస్సును ఎం, ఎన్, ఆర్ డెంటల్ కాలేజీకి చెందిన పిల్లల దంత వైద్య విభాగం నిర్వాహకులు శ్రీధర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డిలోని ఏడు ప్రభుత్వ పాఠశాలలు,రెండు ప్రైవేటు పాఠశాలలో ఉచిత దంత పరీక్షలు నిర్వహించామని తెలిపారు. సుమారు నాలుగు వేల మంది విద్యార్థులకు దంత పరీక్షలు పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి పోటీలు, క్విజ్, ఉపన్యాసం, వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు ఉచితంగా బ్రష్లు పేస్టులు అందించామని తెలిపారు. అలాగే పిల్లల దంత ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లిదండ్రులకు వివరించడం జరిగిందని చెప్పారు.
కళాశాల విద్యార్థులతో కలిసి అధ్యాపకులు భారీ ర్యాలీ, నుక్కడ్ నాటక్ , క్విజ్ పోటీలు నిర్వహించామని డాక్టర్ శీధర్ వెల్లడించారు. ఇందులో 3వ బీడీఎస్ , 4వ బీడీఎస్ ఇంటర్న్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో డాక్టర్ నసీమున్, స్రవంతి, స్నేహిక, తదితర దంత వైద్య విద్యార్థులు హౌస్ సర్జన్లు పాల్గొన్నారు.