Friday, November 22, 2024

బడ్జెట్ లో జిల్లా,మండల గ్రాంట్ పెంచాలి: ఎమ్మెల్సీ పోచంపల్లి విజ్ఞప్తి

జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లకు ఈ బడ్జెట్ లో గ్రాంట్ ని పెంచాలని కోరుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత బడ్జెట్ రూ. 500 కోట్ల నుండి 750 కోట్ల వరకు పెంచాలని ఎమ్మెల్సీ మంత్రిని కోరారు. అలాగే రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఆరోగ్య కార్డుల జారీ చేయాలని మంత్రిని అభ్యర్థించారు. ఈ నిధుల పెంపు ద్వారా జిల్లా, మండల పరిషత్ ల పరిధిలో మరింత అభివృద్ధి చేయడానికి వీలు అవుతుందని ఆయన అన్నారు. ఆరోగ్య బీమా కల్పించడం ద్వారా N.I.M.Sలో ఉచిత వైద్యం పొందేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు వీలు కలుగుతుందని చెప్పారు.

ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కెసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి నిధులు పెరిగే విధంగా చూడాని మంత్రి ఎర్రబెల్లికి అందించిన వినతి పత్రంలో ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు. కాగా మంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సందీప్ కుమార్ సు, పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ లు కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement