బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీచేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా తనను అరెస్టు చేశారని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆన్‌లైన్‌లో పిటిషన్ వేశారు.
- Advertisement -