Tuesday, November 26, 2024

Big Breaking: సీబీఐ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత – రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు

లిక్క‌ర్ కేసులో ప్రశ్నించేందుకే కస్డడీకి
ఈ మేర‌కు ఈడీ కోర్టు అనుమ‌తి కోరిన సిబిఐ.
ప్ర‌స్తుతం తిహార్ జైలులో జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో క‌విత
రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్న సిబిఐ

ఢిల్లీ: మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. తిహార్ జైలులో ఉన్న ఆమెను అధికారులు ఇవాళ‌ ఉదయం త‌మ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమె ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. గ‌తంలో మద్యం కేసులో గతంలో కవితను హైదరాబాద్ లో సీబీఐ ప్రశ్నించింది. ఆ తర్వాత ఈనెల 6న జైలులో మరోసారి ప్రశ్నించింది.

ఈ నేప‌థ్యంలోనే ఆమెను నేడు సిబిఐ అదుపులోకితీసుకుంది.. ఈ విషయాన్ని సిబిఐ దృవీకరించింది. అలాగే రేపు ఆమెను కోర్టులో ప్రవేశపెడతామని పేర్కొంది.. ఇది ఇలా ఉంటే సిబిఐ కస్డడీలోకి తీసుకోవడం కవిత న్యాయవాది కోర్టులో అత్యవసర విచారణకు పిటిషన్ దాఖలు చేశారు.. అయితే నేడు కోర్టుకు సెలవు కావడంతో రేపు పిటిషన్ దాఖలు చేయవలసిందిగా న్యాయమూర్తి సూచించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement