ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య పోరు కారణంగా గాజాలో ఏర్పడిన సంక్షోభం తనను కలచివేస్తోందని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే, యుద్ధం ఏదైనా సరే.. బాధితుల్లో ముందు మహిళలు, చిన్నారులే ఉంటారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. యుద్దంలో ఎవరు మరణించినా,గాయపడిన ఆ శోకం, బాధ తల్లికే అంటూ పేర్కొన్నారు.
ఈ యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభం వీలైనంత త్వరగా తొలగిపోవాలని ప్రార్థిస్తున్నట్లు వివరించారు.
తొందర్లోనే గాజాలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న గొడవకు శాంతియుత పరిష్కారం లభించాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. గాజాలో ఏ తల్లీ కూడా తన బిడ్డలను కోల్పోవద్దని.. ముఖ్యంగా యుద్ధానికి తన బిడ్డలను కోల్పోవద్దని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.