Tuesday, November 19, 2024

సింగరేణిలో కోవిడ్ నియంత్రణకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ!

సింగరేణిలో కోవిడ్ మహమ్మారి కట్టడికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సింగరేణి యాజమాన్యంతో, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో  కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కు అనేక చర్యలు చేపడుతోంది. కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు మొదలు వైద్య సేవలు, క్వారంటైన్‌ సెంటర్‌ల ఏర్పాటు, ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వరకు అన్ని దశల్లో కరోనా కట్టడికి కృషి టీబీజీకేఎస్ చేస్తున్నది. సింగరేణి సీఎండీ శ్రీధర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సింగరేణి కార్మికుల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కవిత కార్యాచరణ రూపొందించారు. అందుకోసం సుమారు నాలుగు కోట్ల రూపాయలతో, లక్ష పదివేల రాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు, భారీ ఎత్తున పరీక్షలు, 25 వేల మందికి వ్యాక్సినేషన్, 1,400 బెడ్ లతో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు రంగం సిద్దం చేశారు. ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా ఉన్న కరోనా ప్రత్యేక వార్డులతో పాటు ఐసోలేషన్ సెంటర్లలో అందిస్తున్న వైద్య సేవలతో 9,650 మంది పూర్తిగా కోలుకున్నందుకు కవిత హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement