కాంగ్రెస్ పార్టీ సభకు ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద, జాగృతి పైన ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు…ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు నాపై చేశాడని నిప్పులు చెరిగారు కల్వకుంట్ల కవిత.
పార్టీ సభకు ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారు…అధికారికంగా హెలికాప్టర్ వేసుకొని వెళ్లి పార్టీ సభ పెట్టారని ఆగ్రహించారు. వేదిక, కుర్చీలు,లైట్లు పెట్టినందుకు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా? అని నిలదీశారు. మలి దశ ఉద్యమంలో అమరులైన అమరులకు కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారికంగా హెలికాప్టర్ వేసుకొని వెళ్లి పార్టీ సభ పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఎలా పిలుస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని పిలిస్తే నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత?. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ నిత్యం ఢిల్లీకి ప్రత్యేక విమానం, చార్టెడ్ ఫ్లైట్స్లో వెళ్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ఖర్చుతోనే వెళ్తున్నారు కదా?. జై సోనియా అంటున్నారు కానీ.. జై తెలంగాణ అనే మాట రేవంత్ రెడ్డి నోటి నుంచి రాలేదు. కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు.
సీఎం రేవంత్ ఒక్కరోజు కూడా అమరులకు నివాళులు అర్పించలేదు. ఒక్క అమరవీరుడి కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. మాది కుటుంబ పార్టీ అంటున్న రేవంత్, కాంగ్రెస్ నేతలు.. హస్తం పార్టీలోని 22 కుటుంబాలకు ఎమ్మెల్యే టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, వారి కుటుంబ సభ్యుల వివరాలను చదివి వినిపించారు. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను ఇక్కడ పెట్టడం, సీఎం ఢిల్లీ పర్యటన ఖర్చులు ప్రభుత్వం బయట పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. 100 రోజుల తరువాత మేము ప్రశ్నిస్తాం.. రేవంత్ ను యూటర్న్ ముఖ్యమంత్రి అని అంటారు.. చెప్పింది ఒకటి.. చేస్తుంది ఒకటి అంటూ కవిత విమర్శించారు.