Friday, November 22, 2024

కష్టాల్లో ఉన్నవారికి ఎమ్మెల్సీ కవిత భరోసా… సర్జరీ కోసం రూ.2.50లక్షల LOC అందజేత

నిజామాబాద్ జిల్లాలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా ప్రజలకు తాను అండగా ఉంటానంటూ నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలోని ఎంతోమంది ఆరోగ్య కష్టాల్లో ఉన్నవారిని తమ ధరిన చేర్చుకొని వారి కష్టాలను తీర్చిన ఘనత ఎమ్మెల్సీ కవితకు దక్కింది. నిజామాబాద్ జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఆమెను అక్కగా సంబోధించినట్లుగానే కార్యకర్తలకు, పార్టీలకతీతంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇంటికి పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ ప్రతి వారి కష్టాల్లోనూ కవితమ్మ అండగా ఉంటున్నారు.

బోధన్ నియోజకవర్గంలోని ఉట్ పల్లి గ్రామానికి చెందిని గిరిజన నిరుపేద దియావత్ వసంత్ 13 సంవత్సరాల కుమారుడు దియావత్ ఈశ్వర్ కు కంటి నరాల, వెన్నెముక కు సంబంధించిన ఆపరేషన్ ఉండడంతో నిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉండగా.. ఈ విషయాన్ని ఉట్ పల్లి ఎంపీటీసీ దియావత్ పిరుబాయి తనయుడు కో-అప్సన్ సభ్యులు సంతోష్ కుమార్ నేరుగా ఎమ్మెల్సీ కవిత దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కవిత CMRF క్రింద 2,50,000/- LOC ను ఇప్పించారు.

స్పందించిన కవితమ్మ మానవ దృక్పధం పట్ల విద్యార్థి తల్లిదండ్రులు అయిన దియావత్ కవిత, వసంత్ లు, ఉట్ పల్లి ఎంపీటీసీ పిరుబాయి నారాయణ, కో అప్సన్ సభ్యులు సంతోష్ కుమార్ ధన్యవాదములు తెలిపారు. ఎంతోమంది రాజకీయ నాయకులను చూసామని కవితమ్మలా వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఎంతో గొప్ప విషయమని, ఆమెకు ఉట్ పల్లి గ్రామం, గిరిజనులం ఎప్పటికీ రుణపడి ఉంటామని సంతోష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement