ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. తీహార్ జైలులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఇవాళ ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. అయితే కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
తదుపరి విచారణ జులై 3కు వాయిదా వేసింది. మే10వ తేదీన ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవితను సమన్లు జారీచేస్తూ మీపై అభియోగాలు మోపపడ్డాయి. ఈ కేసుపై ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంది కాబట్టి జైల్లో ఉండాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు కోర్టులో విచారణ జరగనుంది.
- Advertisement -