బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వచ్చింది. మే 6వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అరెస్ట్ పై కవిత వేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనను విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ తీర్పు వెలువడనుందని భావిస్తున్న సమయంలో తీర్పును వాయిదా వేసింది.
- Advertisement -
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల మార్చి 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయగా, తర్వాత తీహార్ జైలులో ఉన్న కవితను అదే కేసులో సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కూడా తీర్పును మే 6వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో మే 6వ తేదీన కవిత బెయిల్ పై తీర్పు వెలువడనుంది.