స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అవుతుందని చెప్పారు. లెక్కింపు ప్రాంగణంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. 4 టేబుళ్లలలో లెక్కింపు, ప్రతీ టేబుల్ కు నలుగురు చొప్పున సిబ్బందిని కేటాయించారు. నలుగురు సూపర్ వైజర్లు, సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఎటువంటి వస్తువులు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ప్రతీ టేబుల్ పై 200 ఓట్ల లెక్కింపు జరుగుందన్నారు. చివరి టేబుల్ పై 138 ఓట్ల లెక్కింపు చేస్తామన్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లు సగం కన్నా ఒక్క ఓటు ఎక్కువ దాటితే ఆ అభ్యర్థి విజయం సాధించినట్టు ప్రకటిస్తామని వెల్లడించారు. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైతే ఒక్క టేబుల్ పైనే చేస్తామని ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ చెప్పారు.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు కోసం భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీపీ విష్ణు వారియర్ తెలిపారు. 200 మందితో ఎన్నికల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ల్లెక్కింపు తరవాత ఎటువంటి విజయోత్సవాలు చేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.