Tuesday, November 26, 2024

కాంగ్రెస్ గూటికి చేరనున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోద‌ర‌రెడ్డి

హైదరాబాద్‌ ,ఆంధ్రప్రభ బ్యూరో : ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నాగర్‌ కర్నూలుకు చెందిన భారత రాష్ట్ర సమితి (భారాస) సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి పార్టీకి గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించారు. భారాసను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు అయన రంగం సిద్ధం చేసుకున్నారు. నాగర్‌ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డితో ఏర్పడ్డ వివాదాలే పార్టీ మారేందుకు కారణమని సమాచారం. ఇరువురు మద్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరడం ఈ విషయంలో భారాస అధినాయకత్వం పట్టించుకోకపోవడంతో కలత చెందిన దామోదర్‌ రెడ్డి పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు అయన సన్నిహితులు చెబుతున్నారు.


అయితే దామాదర్‌ రెడ్డి చేరిక పట్ల సీనియర్‌ నేత కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి కినుక వహంచినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను ఒప్పించే బాధ్యతను పార్టీ అగ్ర నేత జానారెడ్డికి అప్పగించినట్లు సమాచారం. గతంలో జానారెడ్డి సమక్షంలోనే ఈ ఇరువురు నేతలు చర్చలు చేసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇక నాగంను బుజ్జగించేందుకు కాం గ్రెస్‌ అధినాయకత్వం రంగంలోకి దిగింది ఆయనను ఢిల్లి బయలు దేరి రావాలని కోరింది నాగంకు నచ్చజెప్పి దామోదర్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకునేందుకు లైన్‌ క్లియర్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం అనుకున్నట్లుగా జరిగితే మే మొదటి వారంలో ఇక్కడి సరూర్‌ నగర్‌ స్టేడియంలో జరిగే భారీ బహరంగ సభలో దామోదర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ సభకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతున్న సంగతి తెలిసిందే.
నాగర్‌ కర్నూలు నియోజక వర్గం లోని తాడూరు మండలానికి చెందిన దామోదర్‌ రెడ్డి భారాసలో చేరక ముందు కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత స్థానిక సంస్థల తరపున శాసనమండలికి ఎంపికై ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వ#హంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement