గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కి 8 స్థానాలు ఉండే … ఇప్పుడు మెదక్ లో టీఆరెస్ కి ఎనిమిది, కాంగ్రెస్ కి ఒకటి ఉండొచ్చు, కానీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ కి 8 టీఆరెస్ 2 సీట్లకు రావొచ్చని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, హరీష్ రావు కి బహుశా రాత్రి నిద్ర పట్టకపోవచ్చన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఉండదనుకునే సమయంలో నిర్మల ని బరిలో పెట్టేసరికి అర్థం కాలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి నిర్మల జగ్గారెడ్డి కావడంతో మాట్లాడలేరు.. డ్రాప్ చేయించలేరన్నారు.
ఈ రకంగా దామన్న తాను కేసీఆర్ కి షాక్ ఇచ్చామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచే విదంగా ముఖ్యనాయకులు పని చేయాలన్నారు. కాంగ్రెస్ బలం 230 ఓట్లు గెలవడానికి కావాల్సిన మిగితా ఓట్లు ఎలా రబట్టుకోవలనే ఆలోచన చేయాలి.. బీజేపీ ఎంపీటీసీ, జెట్పీటీసీ, కౌన్సిలర్లు టీఆరెస్ కి ఓటు వేసి వృధా చేసుకోవద్దన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయండి.. కానీ బయటికి చెపొద్దన్నారు. టీఆరెస్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెట్పీటీసీ లు సంతోషంగా ఉండొచ్చు.. కాంగ్రెస్ అభ్యర్ధి బరిలో ఉండడంతో.. కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ ఎలా రిజెక్ట్ చేయించాలనే పనిలో పడ్డారు టీఆరెస్ నాయకులు, హరీష్ రావు అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..