Wednesday, December 18, 2024

TG | ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోవాలి.. మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ చర్చలో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల‌ని స్పీక‌ర్‌ను శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. వివేక్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదని, ఆయన 2014లోనే అసెంబ్లీకి వ‌చ్చార‌ని, ఇంకా అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నార‌ని విమర్శించారు.

వివేక్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వమే రూల్ ఫ్రేమ్ చేసి, అసెంబ్లీలోకి ఇతర దుస్తులు వేసుకురావద్దని నియమాలు పెట్టిన విషయాన్ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌ గుర్తు చేశారు. మంగ‌ళ‌వారం నల్ల దుస్తులు వేసుకొస్తే, అయ్యప్ప భక్తి అనుకున్నాం… కానీ, ఈ రోజు ఆటో డ్రైవర్ దుస్తులు వేసుకొచ్చారని తెలిపారు.

- Advertisement -

బీఆర్ఎస్ వ్య‌వ‌హారంపై మండిప‌డ్డ మంత్రి శ్రీ‌ధ‌ర్‌..
అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరిస్తున్నారంటే అది బీఆర్ఎస్ వ్యవహారం అని మంత్రి శ్రీ‌ధ‌ర్‌ మండిపడ్డారు. ఈ క్రమంలో, బీఆర్ఎస్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. వివేక్ చేసిన వ్యాఖ్యలను 320 రూల్ ప్రకారం తొలగించినట్లు స్పీకర్ ప్రకటించారు. కానీ, వివేక్ తన వ్యాఖ్యలను మరొకసారి పునరుద్ఘాటిస్తూ, ప‌ది శాతం లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement