సంక్షేమ సంఘాలు కాలనీల అభివృద్ధికి సహకారం అందించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రావినారాయణ రెడ్డి నగర్ ఈస్ట్ వీకర్ సెక్షన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను తన నివాసం వద్ద సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘం సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ ఎటువంటి సమస్యలున్నా… తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ బి.నారాయణ, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, జెనరల్ సెక్రెటరీ సుబ్బారావు, జాయింట్ సెక్రటరీలు మన్మధ రావు, శ్రీనివాస్, ట్రెజరర్ సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.