కుత్భుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టకు చెందిన విశ్వకర్మ సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ గురువారం
ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. సంఘం సభ్యులకు ఎటువంటి సమస్యలున్నా వాటి పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటానని హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాలబ్రహ్మచారి, ఉపాధ్యక్షుడు కృష్ణాచారి, కోశాధికారి రవీంద్రా చారి, రఘుచారి, జయంచారి, వెంకటేష్ చారి, మధుసూధన్ చారి, కరుణాకర్ చారి, ఉపేందర్ చారి, అజయ్, రమేష్ చారి, మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital