Thursday, November 21, 2024

జంక్షన్ల అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే పర్యటన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధిలోని జంక్షన్ల అభివృద్ధిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఐడీపీఎల్ జంక్షన్ వద్ద ఇంజనీరింగ్, ట్రాఫిక్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఎలక్ట్రికల్, లా అండ్ ఆర్డర్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా దిన దిన వేగంగా అభివృద్ధి చెందుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జంక్షన్ ల వద్ద తీసుకోవాల్సిన చర్యలను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్న ఐడీపీఎల్, షాపూర్ నగర్, సూరారం జంక్షన్ ల వద్ద ఫ్రీ లెఫ్ట్, కరెంటు స్థంబాలు వేరొక చోటుకు బదిలీ, రోడ్డు వెడల్పు పనులు చేపట్టేందుకు వెంటనే సర్వే చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా జంక్షన్ల‌ అభివృద్ధికి అవసరమైన వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి పనులు త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఎస్ఈ చెన్నారెడ్డి, ఈఈ కృష్ణ చైతన్య, ఏసీపీ కె.చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్ స్పెక్ట‌ర్ కె.చంద్రశేఖర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రఘునందన్, డీటీ శ్రీనివాస్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు శంకరయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయ రామ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకులు భాస్కర్ రెడ్డి, కాప సుబ్బా రెడ్డి, సాయి కిరణ్, రాణి, క్రాంతి యాదవ్, సతీష్ గట్టోజి, ఆంజనేయులు, అల్లావుద్దీన్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement