Wednesday, December 4, 2024

ADB | రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డ్ సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్

ఉట్నూర్, డిసెంబర్ 3 (ఆంధ్రప్రభ) : రాష్ట్ర వన్య ప్రాణి సంరక్షణ బోర్డులో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ కు చోటుదక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఛైర్మెన్ గా, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వైస్ ఛైర్మెన్ గా ఉన్న ఈ కమిటీలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ ను సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వo ఉత్తర్వులు జారిచేసింది. కమిటీలో మరో ముగ్గురు ఎమ్మెల్యే లను సభ్యులుగా నియమించారు. మూడు సంవత్సరాల పాటు ఈ కమిటీ కొనసాగుతుంది.

సభ్యులకు ప్రభుత్వం టిఎ, డిఎ ఇతర భత్యాలు కల్పిస్తుంది. వన్య ప్రాణి సంరక్షణకు ఈ బోర్డు ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసే బాధ్యత కలిగి ఉంటుంది. కమిటీలో మరో ముగ్గురు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో పాటు మరో పన్నెండు మంది రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా సభ్యులుగా ఉంటారు.

కవ్వాళ టైగర్ జోన్ పరిధిలో ఉన్న ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ కు ఈ కమిటీలో చోటు దక్కడంతో ఈ ప్రాంత సమస్యలు పరిష్కారమ‌య్యే అవకాశాలు ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ నియామకం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement