గని ప్రమాద బాధితులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన చేరుకున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారి వద్దకెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు. ఆర్జి-3 ఏరియా అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం గని పైకప్పు కూలింది. దీంతో తీవ్ర గాయాల పాలై సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రమాద బాధితులు. హైదరాబాద్ నుండి హుటాహుటిన గోదావరిఖని చేరుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వారిని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో సంప్రదించారు. మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే హైదరాబాద్ కు రెఫర్ చేయాలని సూచించారు. ఆయన వెంట నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ తదితరులున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement