Friday, November 22, 2024

ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాల‌న్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

దిల్ సుఖ్ నగర్ : యాసంగిలో వరిధాన్యం కొనుగోలు పై కేంద్ర వైఖరి మార్చుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి డిమాండ్ చేశారు. దాన్యం కొనుగోలు లో కేంద్రం వైఖరికి నిరసనగా ఈరోజు నగరంలోని ఇందిరా పార్కు వద్ద టిఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్ఎస్ శ్రేణులనుద్దేశించి సుదీర్ రెడ్డి మాట్లాడుతూ… వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు కుటిల రాజకీయాలు చేస్తూ రైతులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులంతా యాసంగి కాలంలో వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని పిలుపునిచ్చారు. మహాధర్నాకు తరలి వెళ్ళిన వారిలో ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గుప్తా, నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంతుల రాజారెడ్డి, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ తో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement