కర్మన్ ఘాట్ సెప్టెంబర్ 17 (ప్రభ న్యూస్) రక్తదానం మనిషి ప్రాణాన్ని కాపాడుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. లైన్స్ క్లబ్ హైదరాబాద్ సెంటీనాల్ డిస్ట్రిక్ట్ 320 ఏ మరియు భాగ్యనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భాగ్యనగర్ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు తో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం మహాదానం” నిజానికి ప్రకృతిలో అత్యంత విలువైనది రక్తం అత్యంత ఆవశక్యమైన ఈ రక్తాన్ని ఉత్పత్తి చేసే శక్తి సామర్ద్యాలు కేవలం మన దేహానికి మాత్రమే ఉంది అని అన్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది దాతలు రోడ్డున పడ్డ నిరుపేదల కుటుంబాలకు,మధ్య తరగతి కుటుంబాలకు వారి కడుపు నింపడానికి ముందుకొచ్చారు.అన్నం వండిపెట్టారు,నిత్యావసరాలు పంచిపెట్టారు.కానీ మరో దానాన్ని మరచిపోతున్నాము అదే రక్తదానం అన్నారు.ప్రస్తుతం బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు నిండుకోవడంతో రోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది అని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు .కోవిడ్ కారణంగా రక్తదానం చేసే వారి సంఖ్య బాగా తగ్గింది దీనితో డిమాండ్ పెరిగింది అన్నారు.ఈ పరిస్థితి నుండి బయట పడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.లాక్ డౌన్ వల్ల రక్తదానం చేసే వారి సంఖ్య చాలా తగ్గిందని తెలిపారు.రక్తాన్ని ప్రయోగశాలలో తయారుచేయలేం,కాబట్టి రక్తం కావాలంటే దాతలు ముందుకు రావాల్సిందే అని తెలిపారు.
కానీ సాదారణ ప్రజానీకంలో చాలామందికి రక్తదానం పట్ల అపోహలు ఎక్కువ తమ ఆరోగ్యానికి ఎక్కడ ముప్పువస్తుందో అని భయపడి రక్తదానం చేయడానికి ముందుకు రావడం లేదు అన్నారు.ప్రతి ఒక్కరు నిర్భయంగా రక్తదానం చేయవచ్చు అని తెలిపారు.గర్భిణీ స్త్రీలకు,కిడ్నీ డయాలసిస్ బాధితులకు,తలసేమియా వ్యాధిగ్రస్తులకు,ప్రమాదాలకు గురైనవారు,బైపాస్ సర్జరీ రోగులు,కాన్సర్ పేషెంట్స్ తదితరులకు రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు.కావున ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి,ప్రాణదాతలు అవ్వండి అని సుదీర్ రెడ్డి పిలుపునిచ్చారు.
దాదాపు 100 మంది రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మామిడి జగన్నాథ్ రెడ్డి, కాలనీ ప్రతినిధులు రామ్ చందర్ ,జగన్నాథ్ రెడ్డి ,రమేష్ గౌడ్, వేణు, శ్రీనివాస్ రెడ్డి, జగన్నాథం, బి ఆర్ ఎస్ మాజీ అధ్యక్షులు తిలక్ రావ్, ఉప్పల శ్రవణ్ కుమార్ గుప్తా, గంగపుత్ర భాస్కర్, లక్ష్మీ ప్రసన్న, రాణమ్మ, శ్రీధర్ ,పార్వతి, అర్ధ వెంకటరెడ్డి, నరే శ్రీనివాస్ కుర్మా, వెంకటేష్ గౌడ్, రావులకొల్లు ప్రకాష్, అండే కార్ ఇంద్రాజీ, సురేష్, అనిల్ గౌడ్, పలు దేవాలయం కమిటీ ధర్మకర్తలు,లయన్స్ క్లబ్ సంస్థ ప్రతినిధులు నాయకులు, మహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.