వరి ధాన్యం కొనుగోలు విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్నటి వరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉన్నట్లు ఉండగా.. తాజాగా కాంగ్రెస్ సీన్ లోకి వచ్చింది. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ధాన్యం కొనుగుళ్ల విషయంలో కేంద్రం తీరుకు నిరసనగా సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రంపై నిప్పులు చెరిగారు.
అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ధాన్యం కోనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసింది. వరిధాన్యం కొనుగోలు విషయంపై కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రైతాంగం నష్టపోతుందని అనుకుంటే వడ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్నవన్నీ దొంగదీక్షలే అని అన్నారు. వడ్ల కొనుగోలుకు పరిష్కారం చూపకుండా దీక్షలకు దిగడం సిగ్గు చేటని ఆమె విమర్శించారు. కేంద్రం వ్యవసాయ చట్టలు తీసుకువచ్చినప్పుడు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలను అమలు చేస్తున్నప్పుడు ఏం చేశారని కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు. దమ్ముంటే కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేయాలని సీతక్క సవాల్ విసిరారు. ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీలా కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఏడేళ్ల నుంచి బీజేపీతో ఏడు అడుగులు నడిచారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.
ఇది కూడా చదవండి: మోదీ విధానాల వల్లే సమస్యలు.. అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర : సీఎం కేసీఆర్
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily