Tuesday, November 26, 2024

కొత్త పెన్షన్లు లేవు.. డబుల్ బెడ్రూం ఇండ్లు లేవు

తెలంగాణలో గడిచిన నాలుగేళ్లుగా కొత్త పెన్షన్లు లేవని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. జిల్లాలోని కొత్త గూడ,గంగారాం మండలాల్లో ఆమె పర్యటించారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్.. పల్లె పల్లెకు సీతక్క కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం లు మంజూరు చేయాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములకు పట్టాలు రాలేన్నారు. సీఎం కెసిఆర్ ధరణి పోర్టల్ ను సవరించి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. గడిచిన 4 ఏళ్లలో ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. అర్హులను గుర్తించి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, రైతు రుణమాఫీ లాంటి అనే హామీలు ఇచ్చినా.. వాటిని అమలు చేయలేదన్నారు. యాసంగిలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలని సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీని ప్రజలు ఆదరించాలి, మే 6న రాహుల్ గాంధీ వరంగల్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement